గోప్యత
చివరిగా మార్చింది: 20 నవంబర్ 2026. యాప్ ఇంకా విడుదల కాలేదు; ఇప్పుడు తయారవుతున్న యాప్ ఏం చేస్తుందో ఈ పేజీ చెబుతుంది. విడుదల సమయంలో దీన్ని మళ్ళీ సరిచూసి మారుస్తాం.
క్లుప్తంగా
- మీరు స్వామితో మాట్లాడేటప్పుడు మీ గొంతు Google వారి Gemini సేవకు వెళ్తుంది. సంభాషణ జరగాలంటే ఇది తప్పదు.
- మీ సంభాషణల మాటలు (రాత రూపంలో), మీరు స్వామికి చెప్పిన వాటిలో ఆయన గుర్తుంచుకున్న విషయాలు మా సర్వర్‌లో ఉంటాయి.
- గుర్తుంచుకోవడం ఆపవచ్చు. మీ వివరాలన్నీ చూడవచ్చు, ఒక కాపీ తీసుకోవచ్చు, తొలగించవచ్చు.
మీ గొంతు
మీరు చెప్పేది అర్థం చేసుకుని జవాబు ఇవ్వడానికి, స్వామితో మాట్లాడేటప్పుడు మీ గొంతు Google వారి Gemini సేవకు పంపబడుతుంది. స్వామి జవాబులు తయారయ్యేది కూడా అక్కడే. మీ సంభాషణల గొంతు రికార్డింగ్‌ను మేము దాచం; రాత రూపంలో మాటలు మాత్రమే ఉంటాయి.
మా సర్వర్‌లో ఉండేవి
- మీ పేరు, గోత్రం, కుటుంబ సభ్యుల వివరాలు, ఊరు.
- జాతకం కోసం మీరు ఇస్తే: పుట్టిన తేదీ, సమయం, ఊరు.
- స్వామికి గుర్తున్న విషయాలు (ఉదాహరణకు కుటుంబంలో ఒకరి పేరు, ఒక మొక్కు).
- మీ సంభాషణల మాటలు, రాత రూపంలో, మీరు ఎంచుకున్నంత కాలం: 30 రోజులు, 1 సంవత్సరం, లేదా ఎప్పటికీ. మీరు ఏదీ ఎంచుకోకపోతే 1 సంవత్సరం.
- మీరు చేసిన పూజలు, పూజ మధ్యలో ఆపితే ఎక్కడ ఆపారో, జపం లెక్క.
- కుటుంబ సందర్భాలు (పుట్టినరోజు, తిథి లాంటివి), రిమైండర్లు, మీరు గుర్తు చేయమన్న పండగలు.
- మీరు పంపిన పొరపాటు నివేదికలు, వాటితో పంపిన వాయిస్ నోట్ ఉంటే అదీ.
సమస్యలు సరిచేయడానికి వాడే సర్వర్ లాగ్లలో సంభాషణల భాగాలు కొంతకాలం, ఒక సంవత్సరం దాకా, ఉండవచ్చు.
ప్రస్తుతం యాప్‌లో లాగిన్ లేదు. ఈ వివరాలు మీ ఫోన్‌కు ఇచ్చిన ఒక గుర్తింపు సంఖ్యతో ముడిపడి ఉంటాయి.
మీ ఫోన్లో ఉండేవి
మీ సెట్టింగ్స్, భాష, రిమైండర్లు, మీ వివరాల కాపీ.
మీ చేతిలో ఉన్నవి
- గుర్తుంచుకోవడం ఆపవచ్చు. "నేను చెప్పినవి స్వామి గుర్తుంచుకోవాలి" అనేది మొదట ఆన్‌లో ఉంటుంది. సెట్టింగ్స్‌లో ఆపితే, కొత్తగా ఏదీ గుర్తుంచుకోరు.
- చూడవచ్చు. మా దగ్గర ఉన్న మీ వివరాలన్నీ యాప్‌లో ఒకే చోట కనిపిస్తాయి. ఒక్కొక్కటి విడిగా తొలగించవచ్చు.
- కాపీ తీసుకోవచ్చు. మీ వివరాలన్నిటినీ ఒక ఫైల్‌గా పొందవచ్చు.
- సంభాషణలు ఎంతకాలం ఉండాలో ఎంచుకోవచ్చు. తక్కువ కాలం ఎంచుకుంటే పాతవి వెంటనే తొలగిపోతాయి.
- అన్ని సంభాషణలు తొలగించవచ్చు. ఫోన్లో, మా సర్వర్‌లో రెండు చోట్లా పోతాయి; మీ పేరు, కుటుంబ వివరాలు అలాగే ఉంటాయి.
- అన్నీ తొలగించవచ్చు. మీ వివరాలు, సంభాషణలు, నివేదికలు, వాటి వాయిస్ నోట్లు. (పైన చెప్పిన సర్వర్ లాగ్లలోని భాగాలు వాటి గడువు వరకు ఉండవచ్చు.)
ఈ వెబ్సైట్
- ఈ సైట్లో కుకీలు, ట్రాకర్లు, ప్రకటనలు, బయటి సంస్థల స్క్రిప్ట్‌లు లేవు.
- మీరు ఎంచుకున్న భాష (తెలుగు లేదా English) మీ బ్రౌజర్‌లోనే గుర్తుంటుంది; అది మాకు చేరదు.
- యాప్ వచ్చినప్పుడు తెలియజేయమని మీరు ఫారం నింపితే: మీ పేరు (రాస్తే), ఫోన్ నంబరు లేదా ఈమెయిల్, కావలసిన భాష మాకు చేరతాయి. వీటిని యాప్ వచ్చిందని చెప్పడానికి మాత్రమే వాడతాం. తీసేయమంటే తీసేస్తాం.
మమ్మల్ని అడగాలంటే
సంప్రదించే చిరునామా త్వరలో ఇక్కడ ఉంటుంది.
Privacy
Last changed: 20 November 2026. The app is not released yet; this page describes what the app being built does. We will check and update it again at release.
In short
- While you talk with Swamy, your voice is sent to Google’s Gemini service. The conversation cannot happen without this.
- The text of your conversations, and the things Swamy remembers from what you tell him, are kept on our server.
- You can switch remembering off. You can see all your details, take a copy, and delete them.
Your voice
To understand you and answer, your voice is sent to Google’s Gemini service while you talk with Swamy. Swamy’s answers are produced there too. We do not keep recordings of your conversations, only the text.
What is kept on our server
- Your name, gotram, family members’ details and town.
- If you give them for a jatakam: date, time and place of birth.
- What Swamy remembers (for example a family member’s name, or a vow).
- The text of your conversations, for as long as you choose: 30 days, 1 year, or forever. If you choose nothing, it is 1 year.
- The pujas you have done, where you stopped if you paused one, and your japa count.
- Family occasions (a birthday, a tithi), reminders, and the festivals you asked to be reminded of.
- Mistake reports you send, with any voice note you attach to them.
Server logs used to fix problems may hold parts of conversations for a while, up to one year.
The app has no login at present. These details are tied to an identifier given to your phone.
What stays on your phone
Your settings, language, reminders and a copy of your details.
What you control
- Switch remembering off. “Swamy remembers things I tell him” is on to begin with. When you turn it off in Settings, nothing new is saved.
- See it. Everything we hold about you is shown in one place in the app. You can delete items one at a time.
- Take a copy. You can export all your details as a file.
- Choose how long conversations are kept. If you pick a shorter time, older ones are deleted at once.
- Delete all conversations. They go from the phone and from our server; your name and family details stay.
- Delete everything. Your details, conversations, reports and their voice notes. (Parts held in the server logs mentioned above may stay until they expire.)
This website
- This site has no cookies, no trackers, no ads and no scripts from other companies.
- The language you pick (Telugu or English) is remembered in your own browser; it is not sent to us.
- If you fill in the form asking to be told when the app is out, we receive your name (if you give it), your phone number or email, and the language you want. We use them only to tell you the app is out, and we remove them if you ask.
To ask us something
A contact address will be listed here soon.