నిబంధనలు
చివరిగా మార్చింది: 20 నవంబర్ 2026. యాప్ ఇంకా విడుదల కాలేదు; విడుదల సమయంలో ఈ పేజీని మళ్ళీ సరిచూసి మారుస్తాం.
స్వామి అంటే
ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మాటలతో దారి చూపే యాప్. మీతో మాట్లాడేది ఒక AI; మనిషి కాదు. AI పొరబడవచ్చు.
మీ పురోహితుల స్థానంలో కాదు
- స్వామి మీ కుటుంబ పురోహితులకు బదులు కాదు. మీ ఇంటి ఆచారం, మీ సంప్రదాయం వేరుగా ఉంటే అదే పాటించండి.
- పూజా విధానాలు, మంత్రాలు, వాటి ఆధారాలను పండితులు ఇంకా సరిచూస్తున్నారు. అది పూర్తయ్యేదాకా ఇవి ఇంకా ఖరారు కాలేదు.
- మంత్రాలు వినిపించేది AI గొంతు; పండితుల రికార్డింగ్ కాదు.
- జాతకం, పొంతన, ముహూర్తం లెక్కలు మాత్రమే; ఫలితాలు, భవిష్యవాణి కావు. తేదీని, ముహూర్తాన్ని మీ పురోహితులతో నిర్ధారించుకోండి.
వైద్య, న్యాయ, ఆర్థిక సలహా కాదు
- స్వామి చెప్పేది వైద్య సలహా, న్యాయ సలహా, ఆర్థిక సలహా కాదు. అలాంటి నిర్ణయాలకు ఆయా నిపుణులనే అడగండి.
- ఉపవాసం మీ ఆరోగ్యానికి సరిపడుతుందా అనేది మీ వైద్యులను అడగండి.
- దీపం, కర్పూరం, అగరబత్తి, హోమం లాంటి నిప్పుతో చేసే పనుల్లో జాగ్రత్త మీదే. పిల్లలు దగ్గర ఉంటే మరింత జాగ్రత్త.
పొరపాటు కనిపిస్తే
యాప్లో ఏదైనా తప్పుగా అనిపిస్తే అక్కడే మాకు చెప్పవచ్చు. మీ వివరాలు మేము ఎలా వాడతామో గోప్యత పేజీలో ఉంది.
ఈ సేవను నడిపేది
ఈ సేవను నడిపే సంస్థ పేరు, చిరునామా యాప్ విడుదలకు ముందు ఇక్కడ రాస్తాం.
ఈ నిబంధనలకు ఏ చట్టం వర్తిస్తుందో కూడా అప్పుడే ఇక్కడ రాస్తాం.
మమ్మల్ని అడగాలంటే
సంప్రదించే చిరునామా త్వరలో ఇక్కడ ఉంటుంది.
Terms
Last changed: 20 November 2026. The app is not released yet; we will check and update this page again at release.
What Swamy is
An app that guides you by voice while you do a puja at home. You are talking with an AI, not a person. An AI can make mistakes.
Not a substitute for your purohit
- Swamy does not replace your family purohit. Where your family’s custom or your tradition differs, follow that.
- The puja procedures, the mantras and their sources are still being reviewed by pandits. Until that is finished they are drafts, not final.
- The mantras are spoken by an AI voice, not recorded by a pandit.
- Jatakam, matching and muhurtham are calculations only, not predictions. Confirm any date or muhurtham with your purohit.
Not medical, legal or financial advice
- Nothing Swamy says is medical, legal or financial advice. For such decisions, ask the right professional.
- Ask your doctor whether fasting is suitable for your health.
- With a lamp, camphor, incense, a homam or anything else involving fire, the care is yours to take; more so with children nearby.
If you see a mistake
If something in the app seems wrong, you can tell us from inside the app. How we use your details is on the Privacy page.
Who runs this service
The name and address of the company that runs this service will be written here before the app is released.
The law that governs these terms will be written here at the same time.
To ask us something
A contact address will be listed here soon.